బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్ కాల్పుల ఘటన కేటీఆర్కు గుర్తుకు లేదా?..ఎంపీ చామల కిరణ్  ఫైర్

బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్ కాల్పుల ఘటన కేటీఆర్కు గుర్తుకు లేదా?..ఎంపీ చామల కిరణ్  ఫైర్

హైదరాబాద్, వెలుగు: విద్యుత్తు చార్జీల కోసం కేసీఆర్ పోరాటం చేశారని కేటీఆర్ చెప్పడం పచ్చి అబద్ధమని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. 2000ల సంవత్సరంలో విద్యుత్తు చార్జీల పెంపును నిరసిస్తూ బషీర్ బాగ్ లో ఆందోళన చేసిన వారిపై పోలీసులు కాల్పులు జరిపిన సమయంలో కేసీఆర్  అధికారంలో ఉన్న టీడీపీలో కొనసాగిన విషయాన్ని కేటీఆర్ మరిచిపోయారా అని ప్రశ్నించారు.

ఫామ్ హౌస్ భాగోతాలను డైవర్ట్ చేసేందుకే కేటీఆర్.. పవర్ స్టేషన్ లకు బీఆర్ఎస్ ప్రోగ్రామ్ పెట్టాడని విమర్శించారు. ఉచిత విద్యుత్తు ఇవ్వడం కాంగ్రెస్ పేటెంట్ అని, ఈ విషయంలో నిజాలను మరుగునపరచలేరన్నారు. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్తు ఒప్పందాల్లో జరిగిన అవినీతి కేటీఆర్ కు గుర్తులేదా అని ప్రశ్నించారు.